శబరిమల నిజం

ఎంత దురద్రుష్టం! ఈ మధ్యే గా 100 మంది పైగా భక్తులు తొక్కిసలాట లో చని పోయారు! ఇంతకాలం ఈ విషయం దాచినందుకు దేవస్తానం వాళ్ళని ప్రాసిక్యూట్ చెయ్యాలి

మకరజ్యోతి మానవ సృష్టే

  • కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ట్రావెన్కూర్‌ దేవస్థానం బోర్డు
  • కోచ్చి : శబరిమలై కొండల్లో మకర సంక్రాంతి రోజున దర్శనమిచ్చే ‘మకర జ్యోతి’గా భావించే వెలుగు మానవ సృష్టేనని ట్రావెన్కూర్‌ దేవస్థానం బోర్డు (టిడిబి) సోమవారం కేరళ హైకోర్టులో పేర్కొంది. కేరళ ద క్షిణ జిల్లాలలోని ఆలయాల పనితీరును పర్యవేక్షించే బోర్డు కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. దీనితో ఈ జ్యోతి విషయంలో ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ జ్యోతి సందర్శన సందర్భంగా మూడు నెలల క్రితం జరిగిన తొక్కిసలాటలో 120 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ జ్యోతిని తాము ఏనాడూ దేవతా సంబంధమైనదిగా పేర్కొనలేదని టిడిబి తెలిపింది. ఈ జ్యోతిని అక్కడి కొండ మీద ఉండే గిరిజనులు వెలిగించేవారని తెలిపింది. శబరిమలలో ఈ ఏడాది జనవరి 14న మూడు సార్లు కనిపించిన మకరజ్యోతి దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట అనంతరం దాఖలైన పలు పిటిషన్‌ల విచారణ సందర్భంగా కోర్టు కోరిక మేరకు టిడిబి ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అక్కడ కనిపిస్తున్న వెలుగు మకరజ్యోతి అని రాష్ట్ర ప్రభుత్వం, టిడిబి చెప్పడం ప్రజలను మోసగించడమేనని హేతువాద సంస్థ అయిన కేరళ యుక్తివాది సంఘం (కెవైఎస్‌) ఆరోపిస్తూ వచ్చింది. ఈ వెలుగు కృత్రిమమైనదని తాము చేస్తున్న వాదన సరైనదేనని రుజువైందని ఆ సంస్థ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పుడు టిడిబి దాఖలు చేసిన అఫిడవిట్‌ ఎట్టకేలకు వచ్చిందని వారు నిజం చెప్పినందుకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s