పాషా….దిగ్రేట్

చుట్టూ దట్టమైన పొగ, చెల్లా చెదురుగా మృత దేహాలు, ప్రజల పరుగులు.. హాహాకారాలు… టీ తాగుదామని రోడ్డు మీదికొచ్చిన ఆర్టీసీ డ్రైవర్ షేక్ జానీ పాషాకు ఎదురైన అనుభవమిది. అప్పుడు ఆయన స్పందించిన తీరుకు మెచ్చుకుని ఆర్టీసీ సంస్థ ఆయనకు 25 వేల రూపాయలు నగదు బహుమతిని ఇచ్చి సత్కరించింది. అలాగే ఇటీవల ‘కోవ’ (ఛిౌఠ్చి)అనే సంస్థ ప్రశంసాపత్రంతో సన్మానించి ఆ సాహసాన్ని గౌరవించింది. ఫిబ్రవరి 21 న జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సమయంలో పాషా ఎలా స్పందించారో ఆయన మాటల్లోనే….

pasha

“ఆరోజు నాకు సెలవుదినం. యూనియన్ మీటింగ్ ఉందంటే అక్కడకు వెళ్లాను. మా సమావేశం మొదలవడానికి ఇంకా సమయం పట్టొచ్చని తెలియడంతో టీ తాగుదామని బస్ స్టాప్‌కు వెళ్లాను. ఉన్నట్టుండి నాకు ఎదురుగా కాస్త దూరంలో107 బస్‌స్టాప్ దగ్గర పేలుడు వినిపించింది. బస్‌టైర్ పేలిందని మొదట నేను అనుకున్నాను. ఇంతలో దట్టమైన పొగ కమ్మేసింది. జనం హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతూ కనిపించారు. ఏదో ప్రమాదం జరిగిందని అనుకుని అటువైపు వెళ్లేలోగా రెండో పేలుడు సంభవించింది. ఒక ద్విచక్రవాహనం గాలిలోకి ఎగరడం, దానంత ఎత్తుకు కాకపోయినా కొంత ఎత్తుకు మనిషి ఎగిరి కిందపడటం కనిపించింది. ఏం జరిగిందో అప్పటికి అర్థమయింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయం అల్లుకుంది.

సమాచారంతో మొదలు…
పరిస్థితి అర్థమైన వెంటనే మలక్‌పేట ఎస్సై సత్యనారాయణకు, మా దిల్‌సుఖ్‌నగర్ డిపో మేనేజర్ చిరంజీవికి సమాచారమిచ్చాను. కాసేపటిలోనే అంబులెన్స్‌లు వచ్చాయి. అవి వచ్చేలోపునే అప్పుడే వచ్చిన ఒక మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును ఆపేసి అందులోకి కొంతమంది క్షతగాత్రులను చేర్చి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాను. అయితే నాతోపాటు కొంతమంది యువకులు, సంఘటనా స్థలంలో ఉన్న ఉద్యోగులు స్పందించడంతో మేమంతా బాధితులకు తక్షణ సహకారం చేయగలిగాము. బస్సును పంపించిన క్షణాల్లోనే రెండు అంబులెన్స్‌లు వచ్చాయి. పేలుడు జరిగిన చోటులో గాయాలతో పడి ఉన్న ఒక మహిళను తీసుకుని అంబులెన్స్ వైపు నేను పరుగులు పెడుతుండగా ఆమెలో కదలిక ఆగిపోయింది. ఆ మృతదేహాన్ని అలాగే తీసుకెళ్లి అంబులెన్స్‌లోకి చేర్చాను.

pasha1
నెత్తుటి అనుభవాలు…
‘అయ్యో! ఎంత ఘోరం’ అని ఆగి ఆలోచించుకునే పరిస్థితి లేదు. ఎంతమందికి వీలైతే అంతమందికి బతికించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నామంతా. నాతోపాటు సహాయపనుల్లో ఉన్నవాళ్లంతా ‘ఒక వేళ మళ్లీ బాంబులు పేలితే’ అనే భయాలేవీ లేకుండా బాధితులను ఆదుకున్నారు. రక్తంతో తడిసిన వారిని ఎత్తుకెళ్లడంతో మా బట్టలు కూడా నెత్తుటి మయం అయ్యాయి. వాటిని చూసిన కొంతమంది మాకు గాయాలయ్యాయనుకున్నారు. రెండు అంబులెన్స్‌లు వెళ్లిపోయిన తరువాత, మరో రెండు ఆర్డినరీ ఆర్టీసీ బస్సులను తీసుకువచ్చి అక్కడ నిలిపాము. వాటిల్లోకి చాలామందిని ఎక్కించి ఆసుపత్రులకు తరలించడానికి సాయపడ్డాము.

చీకటి దాహం…
మామూలు సమయంలో పనిచేసే మెదడు, షాక్‌కు గురైనపుడు మాత్రం గందరగోళంలోకి వెళిపోతుంది. భయం వల్ల అప్పటికప్పుడు ఏం చేయాలో, ఒక పద్ధతిగా ఎలా ముందుకుపోవాలో కాసేపు తోచలేదు. పేలుళ్ల ధాటికి కరెంటు వైర్లు తెగి బస్సు షెల్టర్ మీద పడ్డాయి. వాటి వలన ప్రమాదం జరగకుండా చూడాల్సి వచ్చింది. వాటిలో పవర్ సరఫరా అవుతోందో లేదో తెలియదు. కరెంట్ బంద్ అయ్యేవరకు అదొక టెన్షన్. ఆ రాత్రి నేను ఇంటికి వెళ్లలేదు. గాయాల పాలైన వారిని ఆసుపత్రులకు చేర్చడం, బాధితుల బంధువులు తమ వారిని వెతుక్కుంటూ వస్తే వారికి సమాచారం అందించడం..ఇలాగే సాగిపోయిందా రాత్రి.”

బల్లెడ

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

One thought on “పాషా….దిగ్రేట్”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s