ఈ కాబ్ సర్వీస్ లో అందరు ఆడ డ్రైవర్లే

భర్త కోమాలోకి వెళ్లిపోయాడు. బతికే అవకాశం లేదని తేల్చేశారు వైద్యులు. ఉన్నదంతా వైద్యానికే అయిపోయింది. ముగ్గురు పిల్లలు, అత్తమామల్ని పోషించాలి. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. పరిస్థితులకు ఎదురు తిరిగింది. కుటుంబ బాధ్యతల్ని తలకెత్తుకుంది. అవాంతరాల్నిఅధిగమించి విజేతగా నిలిచింది. తన కుటుంబాన్ని నిలబెట్టడమే కాదు, వందల మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది. ఆమే… రేవతి!
rev2
http://sakshi.com/newsimages/contentimages/09062013/mrs-revathi-viira-training9-6-13-9843.jpg‘ఫర్ షి’.. ముంబయి రోడ్ల మీద తిరిగే వారందరికీ ఈ పేరు బాగా పరిచయం. మహిళల కోసం, మహిళలే నడిపే తొలి క్యాబ్ సర్వీస్ ఇది. దీని వ్యవస్థాపకురాలు ముంబైకి చెందిన రేవతి. భర్త తనకిక దక్కడని తెలిసిన స్థితిలో గుండె రాయి చేసుకుని ఆమె ఆరంభించిన సంస్థ ఇది.

అప్పు చేసి, మూడు కార్లు అద్దెకు తీసుకుంది. ఒకటి తను నడుపుతూ, ఇంకో ఇద్దరు అమ్మాయిల్ని ఉద్యోగులుగా చేర్చుకుంది. సంస్థ ఆరంభించిన నాలుగు రోజులకే భర్త చనిపోయాడు. ఈ ఎదురుదెబ్బ చాలదన్నట్లు ఎన్నో బాలారిష్టాలు. కొన్ని నెలల దాకా కస్టమర్లు లేరు.

దీంతో తమ సంస్థ గురించి జనాలకు చేరవేయడం ముఖ్యమని ఓ ప్రకటనల సంస్థను సంప్రదించింది. ఆరు నెలల పాటు తమ సంస్థకు పత్రికలతో పాటు వివిధ మార్గాల్లోప్రచారం కల్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఐతే ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చవుతుందని, ఆరు నెలల్లోపు చెల్లిస్తే 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని.. గడువు లోపు డబ్బులివ్వలేకపోతే సంస్థను తమ సొంతం చేసుకుంటామని షరతు విధించారు. దీనికి ఒప్పుకుంది. కానీ చేతిలో పైసా లేదు.
rev1
సంస్థ గురించి ప్రచారం మొదలయ్యాక వ్యాపారం ఊపందుకుంది. కస్టమర్లు పెరిగారు. రేవతి ప్రయత్నం చూసి మెచ్చిన ఓ కస్టమరు చేబదులుగా రూ.5 లక్షలు ఇచ్చారు. ఇందులో సగం డబ్బులు పెట్టి ప్రకటనల సంస్థ అప్పు తీర్చిన రేవతి.. మిగతా డబ్బులతో గ్యారేజీ ఏర్పాటు చేసి, మరికొన్ని కార్లను అద్దెకుతీసుకుంది. డ్రైవింగ్ పట్ల ఆసక్తి ఉన్న అమ్మాయిలకు శిక్షణనిచ్చి, వారికి తమ సంస్థలోనే ఉద్యోగాలు ఇప్పించింది. ‘ఫర్ షి’ జోరు చూసిన ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ.. దాదాపు 40 కార్లను సమకూర్చింది. దీంతో మూడేళ్లలోనే రూ.50 లక్షల టర్నోవర్ దాటింది సంస్థ.

http://sakshi.com/newsimages/contentimages/09062013/Revathi9-6-13-9875.jpgప్రస్తుతం ముంబయితో పాటు ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లోనూ ‘ఫర్ షి’ క్యాబ్ సర్వీసులు నడుస్తున్నాయి. వందకు పైగా క్యాబ్‌లు రోడ్లపై తిరుగుతున్నాయి. 200 మందికి పైగా మహిళా డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. కేవలం సంస్థను క్యాబ్ సర్వీసులకే పరిమితం చేయకుండా.. మహిళల కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది రేవతి. మూడు నెలల శిక్షణ కాలంలో వారికి డ్రైవింగ్ మెళకువలతో పాటు నడవడిక, భాష తదితర అంశాల్లోనూ తర్ఫీదునిస్తున్నారు. ఏటా వందలమంది మహిళా డ్రైవర్లు రేవతి సంస్థలో, బయట ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ.10 వేల దాకా సంపాదిస్తూ స్వయం ప్రతిపత్తి సాధిస్తున్నారు.

‘‘సంస్థ ఆరంభించినపుడు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కస్టమర్లు లేకున్నా ప్రచారం ముఖ్యమని పెట్రోల్ పోయించి కార్లు తిప్పాను. మా ప్రయత్నం ఫలించింది.’’ అని చెప్పారు రేవతి. కష్టే ఫలి అన్నారు. రేవతిలా కష్టపడితే ఫలితం దక్కకుండా ఉంటుందా ఎవరికైనా!
– ప్రకాష్ చిమ్మల

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s