చేయి చేయి కలిపి సరస్సుకు జీవం పోశారు

peria3

ఉక్కాడం (తమిళనాడు)లోని పెరియకుళం సరస్సు, ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతూ ఉండేది. 320 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మంచినీటి సరస్సు కోయంబత్తూరు ప్రాంతంలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. కానీ నగరీకరణ ఈ సరస్సును క్రమక్రమంగా కాటేసింది.

కొన్నేళ్లుగా చుట్టుపక్కల పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లు తమ వ్యర్థాలను,రసాయనాలను ఇందులోకి వదలడం వల్ల అది కాలుష్య కాసారంగా మారింది. బురద గుంటను తలపించే ఈ సరస్సును ఎలాగైనా బాగుచేయాలనే ఆలోచన గత యేడాది ‘సిరితుళి’ అనే ఎన్జీవో సంస్థకు వచ్చింది. వెంటనే దానికి కార్యరూపం ఇచ్చారు సామాజిక కార్యకర్తలు.

కోయంబత్తూరు కార్పోరేషన్‌ను కలిసి తమ ప్రణాళికను వారి ముందుంచారు.’సిరితుళి’తో చేయి కలిపేందుకు కొన్ని కార్పొరేట్ సంస్థలతోపాటు స్థానికులు కూడా ఉత్సాహం చూపారు. ఇంకేం… ఫలానా రోజు పెరియకుళం సరస్సును ప్రక్షాళన చేస్తున్నట్లు విస్తృత ప్రచారం చేశారు.

ఆదివారం… అందరికీ సెలవు దినం… స్కూలు పిల్లలు, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, సీనియర్ సిటిజన్లు, సిఆర్‌పిఎఫ్ జవాన్లు, పోలీసులు… వారూ వీరనే తేడా లేకుండా వేలాదిమంది సైకిళ్లు, టూవీలర్లు, కార్లు, బస్సులలో ఆ ప్రాంతానికి తరలి వచ్చారు. చేయి చేయి కలిపారు. సరస్సు ప్రక్షాళనకు నడుం బిగించారు.
ఓ వైపు మైకుల్లో ఉత్సాహపరిచే పాటలు… వాటికి అనుగుణంగా యువతరం నృత్యాలతో హోరెత్తిస్తుంటే ఎనిమిది వేలకు పైగా జనం బురదగుంటలోకి దిగి హుషారుగా అందులోని వ్యర్థాలను తొలగించేందుకు కృషిచేశారు. శ్రమైక సౌందర్యాన్ని ఆవిష్కరించారు. ట్రాక్టర్లు,ప్రొక్లెయిన్లతో అధికారగణం వారికి సహాయసహకారాలు అందించింది. పని మధ్యలో అలిసిపోయిన వారికి కొందరు హోటల్ నిర్వాహకులు కాఫీ, బిస్కట్లు, మజ్జిగతోపాటు ఉప్మా, కిచిడీలను ఉచితంగా సర్వ్ చేశారు.

peria2

నాలుగు ఆదివారాలు ఇదే స్ఫూర్తితో పనిచేసి 320 ఎకరాల చెరువును తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు… దాని చుట్టూ… సుమారు ఆరున్నర కిలోమీటర్ల పొడవుతో 20 అడుగుల వెడల్పుతో చెరువు కట్టను నిర్మించారు. కేరళలోని మూకనెరి సరస్సు స్ఫూర్తితో మధ్యలో ఐదారు దీవులను కూడా ఏర్పాటు చేశారు.

” నా చిన్నప్పుడు ఈ సరస్సును చూసి సముద్రం అనుకునేవాణ్ణి. అంత పెద్దగా ఉండేది. సరస్సు మధ్యలో దీవుల్లాగా ఉండే ప్రాంతమంతా పక్షులతో సందడిగా ఉండేది. వాటి కుహు కుహూ రాగాలు మళ్లీ వినాలని చాలా కోరికగా ఉంది” అని ఈ బృహత్ కార్యంలో ఓ చేయి వేసిన 60 ఏళ్ల బషీర్ అహ్మద్ అన్నారు.

ఈ వర్షాకాలంలో సరస్సు తిరిగి జీవం పోసుకుంటుందని, ఇందులో తాము బోటు షికారు కూడా చేస్తామని స్థానికులు చాలా ఆశాభావంతో ఉన్నారు. ఎవరో వస్తారని… ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోయే బదులు… ఈ ప్రయత్నమేదో బాగుంది కదూ!

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

One thought on “చేయి చేయి కలిపి సరస్సుకు జీవం పోశారు”

  1. మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
    క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s