తెలంగాణా లో వున్న సీమాంధ్ర ప్రజల పరిస్తితి

కాంగెస్ లో వున్నTRS కోవర్ట్ మధు యాష్కి తెలంగాణా లో వున్న సీమాంధ్ర ప్రజల కి ఎలాటి భయాలు అక్కర్లేదని హామీ ఇచ్చారు. ఈ హామీ లో ఎంత బోలు  వుందో మధ్యాన్నానికే తెల్సింది. TRS గూండాలు విష్ణు షూటింగ్ మీద దాడి చేసి సీమాంధ్ర ప్రజల పరిస్తితి భవిష్యత్తులో ఎలావుండబోతోందో చూపించారు.

సాక్షి కి జ్ఞానోదయమైంది!!

ప్రజలకి కష్టాలున్నాయని సాక్షి పేపర్ వాళ్లకి సడెన్ గా తెలిసింది. జగన్ సార్ కి సి.ఎం పగ్గాలు రావని తెలియడంతో ప్రజల బాధలు రాయడం మొదలెట్టారు. ఈ మార్పు పేపర్ చదివేవాళ్ళందరూ ఇప్పటికే గుర్తించారు.

వీరుడు

అర్ధం లేని హింసకి తెగబడి తోటి మనుషుల మీద పెట్రోలు చల్లి చంపబోయి తనే సెల్ఫ్ గోల్ చేసుకొన్న సురేంద్ర మాదిగ వీరుడెలా అవుతాడు? తన కిచ్చిన విధినిర్వహణ లో మరణించిన సుభ్రహ్మణ్య రాజు వీరుడవుతాడు కానీ!

సాంబశివుడు సారు

ఈమధ్య సాంబశివుడు అనే అన్న గారు ఒక మాటన్నారు తన ఆరోగ్యం బాగాలేక జనజీవన స్రవతి లోకి వచ్చేసాను అని. అంటే ఆరోగ్యం బాగయి వుషారోస్తే మళ్ళీ గన్ను పట్టి జనాల్ని కాల్చేయడానికి అడివికేల్తారేమో సారు.

భజన కి పరాకాష్ట !

మొన్నామధ్య ఆంధ్ర ప్రదేశ్ పేరుని ఇందిరమ్మ రాష్ట్రం గా పేరు మారుస్తామని మంత్రిణి రాజ్యలక్ష్మి సెలవిచ్చారు. కాంగ్రెస్ లో సైకొఫాన్సి కి ఇంతకంటే పరాకాష్ట లేదేమో!